India: భారత్​ తో అమెరికా గొడవ.. ఇక, నాటు కోడిగుడ్లపై అమెరికన్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే!

  • కోళ్లకు సోయా దాణా 40% భారత్ నుంచే
  • టారిఫ్ ఎక్కువ వసూలు చేస్తోందన్న అమెరికా
  • దర్యాప్తునకు ఆదేశం.. దాణాను బ్లాక్ చేసిన వ్యాపారులు
  • గత ఏడాది నుంచి రెట్టింపైన దాణా ధరలు
  • 20 సెంట్లు పెరిగిన గుడ్ల ఉత్పత్తి ఖర్చు
Americans To Shell Out More For Organic Eggs As A Result Of Spat With India

అమెరికన్లు ఇక మామూలు కోడిగుడ్లతో పాటు నాటు కోడిగుడ్లపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కారణం, భారత్ , అమెరికా మధ్య వాణిజ్య గొడవలే. నాటు కోళ్లు, లేయర్ల దాణా/మేత కోసం అమెరికా దిగుమతి చేసుకునే సేంద్రియ సోయా రొట్ట, సోయా గింజలు 40 శాతం భారత్ నుంచే వెళ్తాయి. అయితే, అమెరికా సంస్థలకు నష్టం చేకూర్చేలా భారత్ అనైతికంగా టారిఫ్ లను ఎక్కువ వసూలు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దానిపై దర్యాప్తునకు ఆదేశించింది కూడా.

దీంతో అమెరికాలో చాలా మంది వ్యాపారులు సోయా దాణాను బ్లాక్ చేశారు. ఫలితంగా వాటి ధరలు భారీగా పెరిగాయి. చాలా చోట్ల మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ ఎఫెక్ట్ కోడిగుడ్ల ధరలపై పడింది. ఇప్పటికే మామూలు కోడి గుడ్ల ధరలు పెరగ్గా.. ఇక నాటు కోడి గుడ్ల ధరలూ భారీగా పెరుగుతాయన్న ఆందోళన నెలకొంది. ఒక్క కోడిగుడ్లే కాకుండా పాలు, పాల పదార్థాలు, మాంసంపైనా ఆ ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికాలోని అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ అయిన ఎగ్ ఇన్నోవేషన్స్ పైనా ఆ ప్రభావం భారీగానే పడింది. ప్రస్తుతం సంస్థ టన్ను దాణాకు 1,700 డాలర్లు చెల్లించి మేతను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది నుంచి దాని ధర రెట్టింపైందని సంస్థ అధిపతి జాన్ బ్రూంక్వెల్ చెప్పారు. 25 కిలోల (ఒక బుషెల్) సోయాబీన్ ధర ప్రస్తుతం 30 డాలర్లుండగా.. గత ఏడాది నుంచి ఇప్పటిదాకా 47 శాతం పెరిగిందంటున్నారు. డజన్ గుడ్లను ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చు 15 నుంచి 20 సెంట్లు పెరిగిందన్నారు. గుడ్ల ఉత్పత్తి దగ్గర్నుంచి.. వాటి ప్యాకేజింగ్, కార్టన్లు, కూలీలు, రవాణా ధరలూ భారీగా పెరిగాయన్నారు.

More Telugu News