Kangana Ranaut: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ తో మళ్లీ చేస్తానంటున్న కంగన  
  • రవితేజ తదుపరి సినిమా అప్ డేట్
  • మరో హిందీ సినిమాలో రానా దగ్గుబాటి
Kangna wants to do a Telugu film with Prabhas

*  ప్రభాస్ తో మళ్లీ ఓ సినిమా చేయాలని ఉందంటోంది బాలీవుడ్ భామ కంగన రనౌత్. గతంలో ప్రభాస్ తో కలసి 'ఏక్ నిరంజన్' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మాట్లాడుతూ, 'ప్రభాస్ ఛాన్స్ ఇస్తే మళ్లీ ఓ తెలుగు సినిమా చేయాలని ఉందని పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. చూద్దాం.. మరి ఆ ఛాన్స్ వస్తుందేమో' అని చెప్పింది కంగన. ఆమె తాజాగా నటించిన 'తలైవి' చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది.
*  ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' చిత్రాన్ని చేస్తున్న హీరో రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం షూటింగును అక్టోబర్ 1 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీకుమార్ దర్శకత్వంలో తాజాగా ఓ హిందీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది. కాగా, ఈ చిత్రంలో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి.

More Telugu News