Nani: 'టక్ జగదీష్' నుంచి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రేపే!

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • నోవాటెల్ హోటల్లో ట్రైలర్ లాంచ్
  • అమెజాన్ ప్రైమ్ లో సినిమా
  • ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్  
Tuck Jagadish trailer launch event will be tomorrow

నాని .. శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'నిన్ను కోరి' సినిమా భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ ఇద్దరూ కలిసి చేసిన మరో సినిమానే 'టక్ జగదీశ్'. ఏప్రిల్లోనే విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. మొత్తానికి 'వినాయక చవితి' కానుకగా ఈ సినిమాను వచ్చేనెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ - నోవాటెల్ హోటల్లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను గోపీసుందర్ అందించాడు.

గ్రామీణ నేపథ్యంలో కుటుంబాలు .. బంధాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నానీకి అన్నయ్యగా జగపతిబాబు నటించారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు పుష్కలంగా ఉన్న ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More Telugu News