jyotika: హిమాల‌యాల‌కు వెళ్లిన హీరోయిన్ జ్యోతిక‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్టుగా బ్యూటిఫుల్ ఫొటోలు

  • జాతీయ జెండా ప‌ట్టుకుని ఫొటో
  • ఆగ‌స్టు 15న అక్క‌డ‌కు వెళ్లాన‌న్న జ్యోతిక‌
  • బికాత్ అడ్వెంచ‌ర్స్ టీమ్‌తో క‌లిసి ప‌ర్య‌ట‌న‌
jyotika goes himalayas

హీరోయిన్ జ్యోతిక ఇటీవ‌ల హిమాల‌య ప‌ర్వతా‌ల‌కు వెళ్లింది. అక్కడి ప్ర‌కృతి అందాల‌తో దిగిన ఫొటోల‌ను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేసింది. ఇన్‌స్టాలో ఆమె చేసిన తొలి పోస్ట్ ఇదే. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న అక్క‌డ‌కు వెళ్లాన‌ని ఆమె తెలిపింది. త‌న చేతిలో జాతీయ జెండాను ప‌ట్టుకుని కూడా ఆమె ఓ ఫొటో తీసుకుంది.
               
అలాగే, క‌శ్మీర్‌లోని స‌ర‌స్సుల మ‌ధ్య దిగిన ఫొటోల‌నూ ఆమె పోస్ట్ చేసింది. బికాత్ అడ్వెంచ‌ర్స్ టీమ్‌లోని స‌భ్యుల‌తో ఆమె ఈ యాత్ర చేప‌ట్టింది. త‌న లాక్‌డౌన్ డైరీలోంచి కొన్ని మంచి అంశాల‌ను పోస్టు చేస్తున్నాన‌ని చెప్పింది. జీవితం వాస్త‌విక‌మైంద‌న్న విష‌యం జీవితాన్ని అస‌లైన విధంగా జీవించ‌డం ప్రారంభించాకే తెలుస్తుంద‌ని ఆమె హిత‌వు ప‌లికింది. ఆమె దిగిన ఫొటోలు  వైర‌ల్ అవుతున్నాయి.

  
       

More Telugu News