Pavan kalyan: భారీ రేటుకు 'భీమ్లా నాయక్' ఆడియో రైట్స్!

  • పవన్ నుంచి 'భీమ్లా నాయక్'
  • సంగీత దర్శకుడిగా తమన్
  • సెప్టెంబర్ 2న ఫస్టు సింగిల్
  • జనవరి 12న సినిమా రిలీజ్  
Huge audio rights for Bheemla Nayak movie

పవన్ కల్యాణ్ - సాగర్ చంద్ర కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో, రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.

పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఫస్టు సింగిల్ ను పవన్ పుట్టినరోజున వదలాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం వారు 5.04 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. డ్యూయెట్లు పెద్దగా లేనప్పటికీ, సందర్భానుసారం వచ్చే పాటలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News