YSRCP: జబర్దస్త్​ కామెడీలాపి.. రాజీనామా చెయ్​: విజయసాయిరెడ్డి

  • దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది
  • ఎన్నికల ముందూ చిట్టినాయుడు, జగడపాటి సర్వేలను చూశాం
  • అపహాస్యం పాలవుతున్నారంటూ కామెంట్
Vijayasai Reddy Criticizes Nara Lokesh

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఎన్నో సర్వేలు చూశామని, మాటలాపి బరిలోకి దిగాలంటూ ఆయన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

‘‘ఎన్నికల ముందు కూడా చిట్టినాయుడు, జగడపాటి సర్వేలను ఎన్నో చూశాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే అదరగొట్టేస్తాడట. ఈ జబర్దస్త్ కామెడీలాపి రాజీనామా చెయ్. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. హాస్యాలకు పోయి అపహాస్యమవుతున్నావ్. రామ రామ’’ అంటూ ఆయన విమర్శించారు.

More Telugu News