Mansukh Mandaviya: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ వచ్చే వారికి పోలియో టీకా: కేంద్ర ఆరోగ్య మంత్రి

  • ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో ఇంకా వేధిస్తున్న పోలియో
  • ఢిల్లీ విమానాశ్రయంలో టీకా కార్యక్రమం
  • ఆరోగ్య బృందాన్ని అభినందించిన కేంద్ర మంత్రి
Polio Vaccines to Afghanistan returnees

ఆఫ్ఘనిస్థాన్‌లో సంక్షోభం నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్‌కు చేరుకుంటున్న వారికి ఉచితంగా పోలియో టీకాలు వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. భయంకరమైన పోలియో వ్యాధిని మన దేశంలో ఇప్పటికే నియంత్రించినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల ప్రజలను ఇది ఇంకా పట్టిపీడిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్ నుంచి భారత్ చేరుకుంటున్న వారందరికీ ఢిల్లీ విమానాశ్రయంలో ఉచితంగా టీకాలు వేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా మంత్రి వెల్లడించారు. టీకాలు వేస్తున్న ఆరోగ్య బృందానికి మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కాగా, నిన్న కాబూల్ నుంచి 168 మంది భారత వాయుసేన విమానం సి-17లో ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 107 మంది భారతీయులున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఇంకా దాదాపు 500 మంది వరకు భారతీయులు ఉన్నట్టు సమాచారం.

More Telugu News