YS Vivekananda Reddy: వైఎస్ వివేక హ‌త్య కేసు: 2 నెల‌ల నుంచి వ‌రుస‌గా డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని విచారిస్తోన్న సీబీఐ

  • 75వ రోజు కొన‌సాగుతోన్న విచార‌ణ‌
  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి ద‌స్త‌గిరి
  • ఇప్ప‌టికే ప‌లువురు అనుమానితుల‌ను ప్ర‌శ్నించిన సీబీఐ
trail in viveka murder case

మాజీ మంత్రి దివంగత‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) 75వ రోజు విచార‌ణ కొన‌సాగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచార‌ణ‌కు వివేక మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి ఈ రోజు కూడా హాజ‌ర‌య్యాడు. రెండు నెల‌ల నుంచి వ‌రుస‌గా ఆయ‌న‌ను సీబీఐ అధికారులు విచారిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ప్ర‌ధాన నిందితుడు సునీల్ కుమార్ యాద‌వ్‌ను గోవాలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న‌ను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని 10 రోజుల పాటు విచారించింది. ఇప్ప‌టికే ఈ కేసులో అధికారు‌లు కీల‌క ఆధారాలు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. వివేక‌ హ‌త్యకు సంబంధించి పలు కోణాల్లో అనుమానితులు, సాక్షుల‌ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. విచార‌ణ‌లో భాగంగా మరికొంత మంది అనుమానితులను అధికారులు విచారించే అవకాశం ఉంది.

More Telugu News