Balakrishna: బాలకృష్ణతో తలపడనున్న విజయ్ సేతుపతి?

  • తమిళనాట స్టార్ హీరోగా బిజీ
  • విలన్ గా తెలుగులో పాప్యులర్
  • బాలకృష్ణ సినిమా కోసం సంప్రదింపులు
  • ఒప్పించే ప్రయత్నంలో గోపీచంద్ మలినేని  
Vijay Sethupathi in Balakrishna movie

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర  కోసం ఆయన ఎంపిక దాదాపు ఖరారైపోయినట్టేనని అంటున్నారు.

తమిళనాట స్టార్ హీరో అయినప్పటికీ, ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి విలన్ గా పరిచయమయ్యాడు. 'మాస్టర్' అనువాద చిత్రంతోనూ, 'ఉప్పెన' సినిమాతోనూ ఆయన విలన్ గా ప్రేక్షకులను మెప్పించాడు. అందువలన ఈ సినిమా కోసం ఆయననే తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

ఒక వాస్తవ సంఘటనకి కాస్త కల్పన జోడించి ఈ సినిమా చేస్తున్నట్టుగా గోపీచంద్ మలినేని చెప్పడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకుకోవాలని గోపీచంద్ మలినేని గట్టిగానే ట్రై చేశాడట. కాకపోతే డేట్లు కుదరకపోవడం వలన ఆమె నో చెప్పిందని అంటున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఏ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా టాక్.

More Telugu News