Manchu Manoj: అనంతగిరి హిల్స్ పై అడ్వెంచర్ టూరిజం... తెలంగాణ మంత్రులతో మంచు మనోజ్ చర్చలు

  • ప్రముఖ పర్యాటక స్థలంగా అనంతగిరి హిల్స్
  • అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు
  • ప్రభుత్వానికి మనోజ్ ప్రతిపాదనలు 
  • మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్
Manchu Manoj proposals for adventure tourism on Ananthagiri Hills in Vikarabad

వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు. అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుపై మంచు మనోజ్ ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తన ప్రతిపాదనలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంపై మంత్రులు వివరణ ఇచ్చారు. అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

More Telugu News