Sharwanand: ఎమోషన్స్ తో ఎగసిపడే 'మహా సముద్రం'

  • విభిన్నమైన కథతో 'మహా సముద్రం'
  • ఎమోషన్ తో కూడిన యాక్షన్
  • కీలకపాత్రలో జగపతిబాబు 
Maha Samudram motion poster released

అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' రూపొందింది. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ వదిలిన పోస్టర్స్ ను కలుపుకుని చూస్తే, ఈ సినిమాలో ఎమోషన్ పాళ్లు ఎక్కువనే విషయం అర్థమవుతోంది.

శర్వానంద్ - సిద్ధార్థ్ పాత్రల పరంగా చూసుకుంటే, యాక్షన్ తో పాటు ఎమోషన్స్ బలంగా ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. ఈ రెండు పాత్రలను చాలా బలమైనవిగా .. కొత్తగా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. ఇక ఈ కథానాయకుల సరసన నాయికలుగా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనున్నారు.

జగపతిబాబు .. రావు రమేశ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు చాలా విలక్షణంగా కనిపిస్తాయని అంటున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. నాయకా నాయికలందరికీ ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే! 

More Telugu News