Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల నేడే... 10.7 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

  • రూ. 693.81 కోట్ల నిధులను విడుదల చేయనున్న సీఎం 
  • విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధుల జమ
  • ఏప్రిల్ 19న తొలి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
Jagananna Vidya Deeven funds to be released today

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'జగనన్న విద్యా దీవెన' రెండో విడత నిధులను ప్రభుత్వం నేడు విడుదల చేయబోతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా రూ. 693.81 కోట్ల రూపాయలను విడుదల చేస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.  

ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 19న తొలి విడతను విడుదల చేయగా... ఈ రోజు రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. డిసెంబరులో మూడో విడత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విద్యారంగానికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 26,677 కోట్ల నిధులను ఖర్చు చేశామని చెప్పింది.

More Telugu News