YSRCP: రఘురామకృష్ణరాజు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలి: ప్రధానిని కోరిన వైసీపీ ఎంపీలు

  • వైసీపీ నేతలకు, రఘురామకు మధ్య ముదిరిన పోరు
  • కొనసాగుతున్న ఫిర్యాదులు, లేఖల పర్వం
  • ప్రధాని, ఆర్థికమంత్రిని కలిసిన వైసీపీ ఎంపీలు
  • రఘురామపై ఆరోపణలు..ఆధారాల అందజేత
YCP MPs complains PM Modi and Nirmala Sitharaman against Raghurama Krishnaraju

వైసీపీ నేతలకు, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య పోరాటం కొనసాగుతోంది. పరస్పరం కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ, లేఖలు పంపుతూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రఘురామకృష్ణరాజు విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

రఘురామకృష్ణరాజుకు, టీవీ5 చానల్ చైర్మన్ నాయుడుకు మధ్య రూ.11 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరిగాయని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. రఘురామను, నాయుడును అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు. దీనిపై ఫెమా కింద కేసు నమోదు చేయాలని, అక్రమ నగదు చెలామణీ చట్టం వర్తింపజేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, తమ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలను కూడా వైసీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు.

More Telugu News