Bonda Uma: ఇళ్ల స్థలాలు రద్దు చేస్తామని వాలంటీర్ల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు: బోండా ఉమ విమర్శలు

  • పేదలకు 30 లక్షల ఇళ్లను ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది
  • కొండలు, గుట్టల్లో సెంటు స్థలాన్ని కేటాయించి చేతులు దులుపుకున్నారు
  • పునాదులకు లక్ష కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు
YSRCP govt has construct houses for poor says Bonda Uma

పేదలకు 30 లక్షల ఇళ్లను ఇస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వారిని మోసం చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా ఇళ్ల ఊసే లేదని మండిపడ్డారు. కొండల్లో, గుట్టల్లో సెంటు స్థలాన్ని కేటాయించి చేతులు దులుపుకున్నారని అన్నారు.

నివాస యోగ్యత లేని స్థలంలో పునాదుల కోసం రూ. లక్ష కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని... లక్ష రూపాయలను పేదలు ఎలా తీసుకొస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని టీడీపీ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా విజయవాడలో మాట్లాడుతూ బోండా ఉమ ఈ వ్యాఖ్యలు చేశారు.

డబ్బు కట్టని వారికి ఇళ్ల స్థలాలను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఉమ మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా పేదలపై ఒత్తిడిని తీసుకొస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేయలేదని, పనులను అర్థాంతరంగా ఆపివేయడంతో అవి వృథాగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పేదలందరికీ జగన్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News