Unity-22: వర్జిన్ గెలాక్టిక్ రోదసియాత్ర విజయవంతం.. భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు

  • సురక్షితంగా ల్యాండైన యూనిటీ-22
  • పూర్తయిన మిషన్ 
  • అంతరిక్ష పర్యాటకంపై కొత్త ఆశలు
  • గంటపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు
Virgin Galactic space tour successful

ప్రపంచ కుబేరుడు, వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. కొద్దిసేపటి క్రితమే నింగికి ఎగిసిన వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా తిరిగివచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ-22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.

కాగా, ఈ రోదసి యాత్రలో తెలుగమ్మాయి శిరీష బండ్ల పాల్గొనడం విశేషం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలో ప్రవేశించిన మూడో భారత సంతతి మహిళగా శిరీష ఘనత సాధించింది.

More Telugu News