Telugu Academy: తెలుగు అకాడెమీ పేరును మార్చిన ఏపీ ప్రభుత్వం

  • తెలుగు, సంస్కృత అకాడెమీగా పేరు మార్పు
  • ఉత్తర్వులను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ గా నలుగురి నియామకం
AP govt changes Telugu Academy name

ఏపీ ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీ పేరును తెలుగు, సంస్కృత అకాడెమీగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అకాడెమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో నలుగురిని నియమించింది. శ్రీవేంకటేశ్వర యూనిర్శిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్ నేరెళ్ల రాజ్ కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.విజయశ్రీ, ఎస్ఆర్ఎస్వీ బీఈడీ కాలేజీ లెక్చరర్ కప్పగంతు రామకృష్ణను బోర్డు గవర్నర్లుగా నియమించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్శిటీ వైస్ చాన్సెలర్ మురళధర శర్మను యూజీసీ నామినీగా నియమించారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News