Jawan: సైనిక లాంఛనాలతో ముగిసిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు

  • కశ్మీర్ లో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు
  • వీర మరణం పొందిన జశ్వంత్ రెడ్డి
  • అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు
Brave soldier Jashwanth Reddy funerals ended

కశ్మీర్ లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టార్ లో గురువారం అర్ధరాత్రి సెన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో మరణించిన తెలుగు జవాను జశ్వంత్ రెడ్డి (23) అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో ఆయన అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. జశ్వంత్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా గౌరవ సూచకంగా సైనికులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి సుచరిత, ఉపసభాపతి కోన రఘుపతి హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జశ్వంత్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మారుమోగింది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన రూ. 50 లక్షల సాయాన్ని కుటుంబసభ్యులకు హోంమంత్రి అందించారు.

More Telugu News