Naga Shauya: క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణలో 'లక్ష్య'

  • నాగశౌర్య 20వ సినిమాగా 'లక్ష్య'
  • విలువిద్య నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా కేతిక శర్మ
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు 
lakshya Climax Shoot

నాగశౌర్య ఈ మధ్య వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. 'వరుడు కావలెను' .. 'పోలీస్ వారి హెచ్చరిక' .. ఇలా మరో రెండు సినిమాల పేర్లు వినిపించాయి ... టీజర్లు గట్రా కనిపించాయి. దాంతో ఆయన ప్రస్తుతం ఏ సినిమా షూటింగులో ఉన్నాడనే విషయం తెలియకుండా పోయింది. కరోనా వలన ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ ఆగిపోవడం ఇందుకు మరో కారణం. తాజాగా ఆయన 'లక్ష్య' సినిమా షూటింగు కోసం ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వచ్చేశాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ మేకింగ్ వీడియోను కూడా వదిలింది. నారాయణ దాస్ నారంగ్ .. పుష్కర్ రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కెరియర్ పరంగా ఇది నాగశౌర్యకి 20వ సినిమా. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  కథానాయికగా కేతిక శర్మ నటిస్తుండగా, కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. సిక్స్ ప్యాక్ తో నాగశౌర్య డిఫరెంట్ లుక్ .. విలువిద్య నేపథ్యంలో సాగే కథ కావడం వలన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.


More Telugu News