Nani: త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్న 'టక్ జగదీష్'

  • 'టక్ జగదీష్'గా కనిపించనున్న నాని
  • శివ నిర్వాణతో రెండో సినిమా  
  • త్వరలోనే ప్రమోషన్స్ మొదలు
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు  
Tuck Jagadish release date is going announce soon

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టక్ జగదీష్' షూటింగును పూర్తిచేసుకుంది. ఏప్రిల్లోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పుడప్పుడే కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో, ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు పరిస్థితి కొంతవరకూ అనుకూలంగా మారింది. త్వరలోనే థియేటర్లను తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

సాధ్యమైనంత త్వరగా ఒక రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి, ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. థియేటర్లు ఓపెన్ కాగానే విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమా ముందు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 'నిన్నుకోరి' హిట్ తరువాత శివ నిర్వాణ - నాని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. రీతూ వర్మ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, నానీకి అన్నయ్యగా జగపతిబాబు కనిపించనుండటం విశేషం.

More Telugu News