kalyan Ram: కేవీ గుహన్ దర్శకత్వంలో మరోసారి కల్యాణ్ రామ్!

  • '118'తో దక్కిన హిట్
  • దర్శకుడిగా కేవీ గుహన్  
  • మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
  • నిర్మాతగా దిల్ రాజు
Kalyan Ram another movie with KV Guhan

ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు. దిల్ రాజు బ్యానర్లో .. కేవీ గుహన్ దర్శకత్వంలో .. కల్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా రూపొందనుందనేది ఈ పోస్టర్ సారాంశం. కల్యాణ్ రామ్ - కేవీ గుహన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన '118' భారీ విజయాన్ని సాధించింది. కల్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు.కేవీ గుహన్ ఫేమస్ సినిమాటోగ్రఫర్ కావడం వలన, ఆయన టేకింగ్ కి మంచి మార్కులు పడిపోయాయి. కల్యాణ్ రామ్ ను చాలా స్టైలీష్ గా చూపించాడని చెప్పుకున్నారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి వెళుతుందన్న మాట. ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'బింబిసార' చేస్తున్నాడు. ఆ తరువాత మరో ఇద్దరు కొత్త దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మరి 'బింబిసార' తరువాత ఆయన ఏ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళతాడో చూడాలి.      

More Telugu News