Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ తో కాజల్ స్పెషల్ సాంగ్ 
  • ఉక్రెయిన్ వెళుతున్న ఎన్టీఆర్
  • మమ్ముట్టికి మూడు కోట్లు?
  • సత్యదేవ్ నటించే 25వ సినిమా    
Kajal Agarwal to do special song for Prabhas movie

*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కథానాయిక కాజల్ అగర్వాల్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే షెడ్యూలులో ఈ పాటను ప్రభాస్, కాజల్ జంటపై చిత్రీకరిస్తారట.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. ఇందులో ఓ పాటను త్వరలో ఎన్టీఆర్, ఒలీవ మోరిస్ జంటపై ఉక్రెయిన్ లోని పలు లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే రాజమౌళి ఉక్రెయిన్ కు వెళ్లి లొకేషన్లను ఎంపిక చేసివచ్చినట్టు చెబుతున్నారు.
*  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా 'ఏజెంట్' పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ఓ కీలక పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నారు. ఇందుకుగాను ఆయనకు 3 కోట్ల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.
*  విభిన్న కథా చిత్రాలలో నటిస్తున్న హీరో సత్యదేవ్ నటించే 25వ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. వీవీ గోపాల కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తారు.

More Telugu News