Philippines: ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం.. ప్రమాద సమయంలో విమానంలో 92 మంది

  • ప్రమాద సమయంలో విమానంలో 92 మంది
  • ఇప్పటి వరకు 45 మందిని రక్షించిన అధికారులు
  • కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు
  • కూలినవెంటనే విమానానికి మంటలు
40 Rescued After Military Plane Carrying 92 People Crashes In Philippines

ఫిలిప్పీన్స్‌లో 85 మంది సైనికులు సహా 92 మందితో వెళ్తున్న విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 45 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నట్టు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా తెలిపారు. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ఈ ఘటన జరిగిందని. విమానం రన్‌వేను చేరుకోవడంలో విఫలం కావడంతోనే ప్రమాదం జరిగినట్టు ఆయన వివరించారు.

ప్రమాదానికి గురైన సి-130 విమానంలోని సైనికులు ఇటీవలే ప్రాథమిక సైనిక శిక్షణను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. దుర్ఘటన జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఏర్పాటు చేసిన సంయుక్త బృందంలో వీరిని చేర్చేందుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కూడా ఉన్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా తెలిపారు. కాగా, విమానం కూలిన జోలో ద్వీపంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

More Telugu News