Kalyanram: మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన 'బింబిసార'

  • చారిత్రక నేపథ్యంలో 'బింబిసార'
  • ముగింపు దశలో షూటింగ్
  • సంయుక్త మీనన్ పరిచయం
  • ముఖ్యమైన పాత్రలో కేథరిన్  
Bimbisara movie update

నిర్మాతగా.. హీరోగా కల్యాణ్ రామ్ ఇంతవరకూ సాంఘిక చిత్రాలను చేస్తూ వచ్చాడు. కానీ ఒక్కసారిగా ఆయన చారిత్రక కథాంశాన్ని ఎంచుకుని పెద్ద రిస్క్ చేశాడు. బింబిసారుడి జీవితచరిత్ర ఆధారంగా ఆయన 'బింబిసార' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై 75 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న తరువాత టైటిల్ పోస్టర్ వదిలి, కల్యాణ్ రామ్ షాక్ ఇచ్చాడు. ఒకరకంగా ఇది కల్యాణ్ రామ్ చేస్తున్న సాహసంగానే చెప్పుకుంటున్నారు. ఏకధాటిగా కొనసాగిన ఈ సినిమా షూటింగుకు ఇటీవల బ్రేక్ ఇచ్చారు.

మళ్లీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినట్టుగా చెబుతున్నారు. నెల రోజుల పాటు జరిపే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో కల్యాణ్ రామ్ ఉన్నాడని చెబుతున్నారు. ఈ సినిమాతో కథానాయికగా సంయుక్త మీనన్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక కేథరిన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో అలరించనుంది. కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.    

More Telugu News