Telangana: లాక్‌డౌన్ ఎత్తివేతపై తెలంగాణ కేబినెట్ ప్రకటన

  • ప్ర‌జ‌ల ఉపాధి దెబ్బతినకూడ‌ద‌నే నిర్ణ‌యం
  • ప్ర‌జ‌ల నుంచి పూర్తిగా స‌హ‌కారం కావాలి
  • కరోనా నిబంధ‌న‌ల‌ను పాటించాలి
telangana cabinet decisions

కరోనా రెండో ద‌శ విజృంభ‌ణ వేళ‌ విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రివ‌ర్గం ప‌లు వివ‌రాలు తెలుపుతూ ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌జ‌ల ఉపాధి దెబ్బతినొద్ద‌నే ఉద్దేశంతోనే లాక్‌డౌన్ ఎత్తివేసిన‌ట్లు తెలిపింది. లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఎత్తివేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు పేర్కొంది.

ప్రైవేటు విద్యా సంస్థ‌లు, కోచింగ్ సెంట‌ర్లు కూడా తెరుచుకోవ‌చ్చ‌ని చెప్పింది. త‌మ నిర్ణ‌యానికి ప్ర‌జ‌ల నుంచి పూర్తిగా స‌హ‌కారం కావాల‌ని కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన‌ప్ప‌టికీ క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని చెప్పింది. మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం వంటి నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని కోరింది.

More Telugu News