Telangana: జులై 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం

  • లాక్ డౌన్ ను ఎత్తేసిన తెలంగాణ ప్రభుత్వం
  • అన్ని విద్యా సంస్థలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచన
  • కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
Schools in Telangana to reopen from July 1

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని కేటగిరీల విద్యాసంస్థలను జులై 1 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖను ఆదేశించింది. జులై 1 నాటికి అన్ని విద్యా సంస్థలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని చెప్పింది. విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత సిబ్బంది, విద్యార్థులు అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించింది. కరోనా వ్యాపించకుండా అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.

More Telugu News