West Bengal: బెంగాల్​ ఎన్నికల అనంతర హింస కేసు: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి

  • తన వల్ల కాదన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ
  • వేరే బెంచ్ కు కేసు బదిలీ
  • హింసలో బీజేపీ కార్యకర్తల హత్య
  • ఇద్దరు మహిళా నేతలపై అత్యాచారం
Supreme Court Judge Recuses From Bengal Post Poll Violence Case

బెంగాల్ లో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ తప్పుకొన్నారు. ఆ హింసలో కొందరు బీజేపీ కార్యకర్తలు మరణించిన సంగతి తెలిసిందే. కొందరు మహిళలపై అత్యాచారాలూ జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి.

అయితే 'నాట్ బిఫోర్ మీ' అంటూ.. కేసును తాను విచారించలేనని, తన వల్ల కాదని బెంగాల్ కే చెందిన జస్టిస్ ఇందిరా బెనర్జీ అన్నారు. ఆమె తప్పుకోవడంతో కేసును సుప్రీంకోర్టు వేరే ధర్మాసనానికి అప్పగించింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే తృణమూల్ గూండాలే బీజేపీ కార్యకర్తలను చంపేశారని, మహిళా కార్యకర్తలపై అత్యాచారాలకు తెగబడ్డారని, ఇళ్లపై దాడులు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ఆయా కేసుల్లో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. సమాధానం చెప్పాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రతి అల్లర్లను ఎన్నికలతో ముడిపెట్టలేమని మమత సర్కారు వివరణనిచ్చింది. అసలు వాటిని ‘ఎన్నికల అనంతర అల్లర్లు’ అని ఎందుకు పిలవాలని పేర్కొంది.

More Telugu News