Brahmam Gari Matam: శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదు: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • వివాదాస్పదంగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశం
  • ఇటీవల కన్నుమూసిన మఠాధిపతి
  • తెరపైకి రెండో భార్య
  • వీలునామా రాశారంటూ వెల్లడి
  • సామరస్య ధోరణిలో ప్రభుత్వం
Vellampalli opines on Brahmam Gari Matam issue

బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి అంశంపై వివాదానికి త్వరలోనే తెరదించుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలోనే మఠాధిపతిని ప్రకటిస్తామని వెల్లడించారు. బ్రహ్మంగారి మఠానికి శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని పేర్కొన్నారు. దేవాదాయ శాఖకు, పీఠాధిపతుల బృందానికి సంబంధం లేదని మంత్రి వెల్లంపల్లి వివరించారు. దివంగత పీఠాధిపతి కుటుంబ సభ్యులు దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని కోరామని వెల్లడించారు. 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించడంతో వారసత్వ అంశం వివాదం రూపుదాల్చింది. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య తమ వద్ద కూడా వీలునామా ఉందని తెరపైకి రావడంతో నూతన మఠాధిపతి ఎంపిక వ్యవహారం సంక్లిష్టంగా మారింది. దీనిపై ప్రభుత్వం సంప్రదింపుల మార్గంలో ముందుకు వెళుతోంది.

More Telugu News