Andhra Pradesh: ఏపీలో కొవిడ్ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు

  • ఉదయం 6 నుంచి సా.6 గంటల వరకు సడలింపు
  • ఈ నెల 21 నుంచి అమల్లోకి సడలింపు
  • సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి
  • తూ.గో.జిల్లాలో ఉ.6 నుంచి మ.2 వరకే సడలింపు
lockdown relaxation in ap

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు ప్ర‌క‌టించారు. ఉదయం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తున్నామ‌ని, ఈ నెల 21 నుంచి ఈ స‌డ‌లింపులు అమల్లోకి వ‌స్తాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. అయితే, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవ‌డానికి అనుమతి ఉంటుంద‌ని, మ‌రో గంట సేప‌ట్లో దుకాణాల సిబ్బందికి ఇంటికి వెళ్లేందుకు స‌మ‌యం ఉంటుంద‌ని చెప్పారు.

క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పు గోదావ‌రి జిల్లాలో ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 2 గంట‌ల‌ వరకే సడలింపు ఉంటుంద‌ని వివ‌రించారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా న‌డుస్తాయ‌ని తెలిపారు. తాజా స‌డ‌లింపులు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని వివ‌రించారు.

More Telugu News