Dilip Lande: వర్షపు నీరు నిలిచిందని కాంట్రాక్టరుపై శివసేన ఎమ్మెల్యే జులుం.. వీడియో ఇదిగో!

  • ముంబయిలో భారీ వర్షాలు
  • నగరం జలమయం
  • పలుచోట్ల డ్రైనేజీలు బ్లాక్ అయిన వైనం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దిలీప్ లాండే
  • కాంట్రాక్టరుపై చెత్త వేయాలంటూ హుకుం
Shivsena MLA Dilip Lande punishes contractor for water lagging

నైరుతి రుతుపవనాల కారణంగా ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే, ముంబయిలోని చాందివాలీ ప్రాంతంలో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుండడంతో అక్కడి శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రైనేజీ కాల్వలకు చెత్త అడ్డంపడి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్టు గుర్తించి, అందుకు డ్రైనేజీ పనుల క్రాంటాక్టరును తీసుకువచ్చారు. ఆ కాంట్రాక్టరును తీసుకువచ్చి అక్కడి మురికి నీటిలో కూర్చోబెట్టారు. అంతేకాదు, అతడిపై చెత్తను వేయాలంటూ పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రోడ్లపై మురికినీరు నిలవడానికి ఆ కాంట్రాక్టరే కారణమని, తన విధి నిర్వహణలో అతడు విఫలమయ్యాడని ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆరోపించారు.

More Telugu News