Maharashtra: శరద్​ పవార్​ తో ప్రశాంత్​ కిషోర్​ భేటీ.. ‘మిషన్​ 2024’పై మంతనాలు!

  • ఎన్సీపీ చీఫ్ ఇంట్లో భోజనం
  • కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చ
  • స్నేహపూర్వక భేటీనే అంటున్న పీకే సన్నిహితులు
Prashant Kishore Meets NCP Chief Sharad Pawar

పశ్చిమ బెంగాల్ గెలుపు జోష్ లో ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇవ్వాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తో సమావేశమయ్యారు. ఎన్సీపీ చీఫ్ ఇంట్లో ఆయనతో కలసి భోజనం చేసిన ప్రశాంత్ .. 2024 ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. బెంగాల్, తమిళనాడుల్లో విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతపూర్వకంగానే ఆయన కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

శరద్ పవార్ ఒక్కరినే కాకుండా.. ఇటీవలి ఎన్నికలలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లకు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరిని ఆయన కలుస్తారని అంటున్నారు. అయితే, కృతజ్ఞతలు తెలపడంతో పాటు ‘మిషన్ 2024’కూ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి దీటుగా పోటీకి నిలబెట్టేందుకు ‘కూటమి’ ప్రధాని అభ్యర్థి గురించి కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News