Pawan Kalyan: హరీశ్ మూవీలో రెండు డిఫరెంట్ పాత్రల్లో పవన్ !

  • పవన్ తో మళ్లీ హరీశ్ శంకర్
  • జూలై నుంచి సెట్స్ పైకి
  • లెక్చరర్ గా కనిపించనున్న పవన్
  • మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్  
Pavan kalyan dual role in Harish Shankar movie

పవన్ కల్యాణ్ హీరోగా గతంలో హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని సాధించింది. పవన్ కల్యాణ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే హరీశ్ శంకర్ ఉన్నాడు. ఈ సినిమాలో పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.

ఒక పాత్రలో కాలేజ్ లెక్చరర్ గా .. మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ రెండు పాత్రలను హరీశ్ శంకర్ డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం కాలేజ్ సెట్ వేయనున్నారనే టాక్ వచ్చినప్పుడే, లెక్చరర్ గా గానీ, ప్రొఫెసర్ గా గాని పవన్ కనిపించవచ్చని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కూడా ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

More Telugu News