Varun Tej: 'గని' కోసం హాలీవుడ్ యాక్షన్ కంపోజర్స్!

  • వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'గని'
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం
HollyWood action composers for Ghani movie

వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా రూపొందుతోంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉన్న కథ ఇది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు. ప్రత్యేకంగా వేసిన స్టేడియం సెట్లో ఈ సినిమా షూటింగును ప్లాన్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ పై బాక్సింగ్ పోటీలకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నారు. పలు హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవల్ - లాడ్ రింబర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కానుంది. జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అంటున్నారు.

More Telugu News