Jabardasth: ఎర్రచందనం కేసులో 'జబర్దస్త్' నటుడు!

  • నటుడు హరి స్మగ్లింగ్ కేసులో బుక్
  • గతంలో కూడా హరిపై కేసులు
  • స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం
Jabardasth actor booked in Red Sandalwood smuggling

తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఇదే సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొనే నటులు పలు కేసుల్లో ఇరుక్కోవడం కూడా మనం చూశాం. కొంత కాలం క్రితం ఒక జబర్దస్త్ నటడు వ్యభిచారం కేసులో కూడా బుక్కయ్యాడు. తాజాగా జబర్దస్త్ మరో నటుడు హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్కయ్యాడు. గతంలో కూడా హరి ఇదే స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

 చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ స్మగ్లింగ్ గ్యాంగుతో హరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెపుతున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఈ అంశంపై హరి స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని... ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని మండిపడ్డాడు.

More Telugu News