Andhra Pradesh: ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద భారీగా నిలిచిపోయిన‌ వాహ‌నాలు

  • లాక్‌డౌన్ ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం
  • చెక్‌పోస్టుల వద్ద త‌నిఖీలు
  • రామాపురం చెక్‌పోస్టు వద్ద వాహ‌నాల అడ్డ‌గింత‌
  • పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు
traffic jam in ap ts border

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ సరిహద్దు వద్ద భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేయ‌డంతో చెక్‌పోస్టుల వద్ద త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద  ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నప్ప‌టికీ వాహనాలను నిలిపివేశారు. ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణ‌లోకి రావ‌డానికి అనుమతి  ఉంటుంద‌ని చెప్పారు. అలాగే, ఎమర్జెన్సీ వాహనాలకు కూడా గుర్తింపు కార్డులు తప్పనిసరి  అని స్ప‌ష్టం చేశారు.  
 
మ‌రోవైపు,  కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పాస్ ఉంటేనే పోలీసులు తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు.  లాక్‌డౌన్ సడలింపు ఉందని భావించి భారీగా వాహనదారులు త‌ర‌లి వ‌చ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుల్లూరు వద్ద సరుకు రవాణా వాహనాల రాకపోకలు మాత్రం య‌థావిధిగా కొన‌సాగుతున్నాయి.

More Telugu News