Hyderabad: తౌతే ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలుచోట్ల కురుస్తున్న వర్షం

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
  • పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
  • నిత్యావసరాల కోసం బయటకు వచ్చి ఇబ్బంది పడిన జనం
Cyclone Tauktae Effect Raing in Hyderabad

అరేబియా  సముద్రంలో పుట్టి కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలను వణికించి గుజరాత్ వద్ద తీరం దాటిన తౌతే తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. దాని ప్రభావంతో మొన్న హైదరాబాద్‌లో భారీ వర్షం పడగా, నేడు నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, కృష్ణానగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్‌పూర్, గండిపేట, గగన్‌పహాడ్, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.కొన్ని ప్రాంతాల్లో ఇంకా పడుతూనే ఉంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వెసులుబాటు ఉండడంతో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు.

More Telugu News