Mohanlal: చారిత్రక చిత్రంగా 'మరక్కర్' .. సంగీత కళాకారిణిగా కీర్తి సురేశ్!

  • 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా
  • 'మలబార్' ప్రాంతాన్ని రక్షించే 'కుంజలి మరక్కర్'
  • యుద్ధ నాయకుడిగా మోహన్ లాల్
  • ఆగస్టు 12వ తేదీన విడుదల      
Keerthi Suresh plays a diffrent role in Marakkar movie

మోహన్ లాల్ అభిమానులంతా ఇప్పుడు 'మరక్కర్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మలయాళంలోనే 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. పోర్చుగీసు వారి నుంచి 'మలబార్' ప్రాంతాన్ని రక్షించుకోవడానికి 'కుంజలి మరక్కర్' చేసిన పోరాటమే ఈ కథ. యథార్థ సంఘటన నుంచి గ్రహించి అల్లుకున్న కథగా చెబుతున్నారు.

ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. దాంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమై ఉంటుంది? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన సంగీత కళాకారిణిగా కనిపిస్తుందట. కథానాయకుడితో ఆమె ఎలా ప్రేమలో పడుతుంది? ఆయనతో ప్రేమలో పడటం వలన ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ పాత్ర నడుస్తుందని అంటున్నారు. తన కెరియర్లోనే ఈ పాత్ర ప్రత్యేకమని కీర్తి చెబుతుండటం విశేషం.

More Telugu News