PV Sindhu: విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రశంసలు కురిపించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

  • విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం
  • ప్రస్తుతం దేశంలో కరోనా సంక్షోభం
  • ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ
  • దేశంలోని పలు ప్రాంతాలకు రైలు ద్వారా సరఫరా
PV Sindhu lauds Vizag Steel Plant in covid crisis

ప్రైవేటీకరణ అంచున నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్)... ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఎంతో విలువైన మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తూ దేశంలోని అనేక ఆసుపత్రుల అవసరాలు తీర్చుతోంది. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన రైలు దేశంలోని పలు ప్రాంతాలకు పయనమైంది. ఈ నేపథ్యంలో, భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం, విశాఖ ఉక్కు పరిశ్రమ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధు స్పందించారు.

దేశం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వేళ ఆర్ఐఎన్ఎల్ ప్రాణవాయువు అందిస్తోందని కొనియాడారు. ఆర్ఎన్ఐఎల్ కృషిని జాతి మరువబోదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని... మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సింధు పిలుపునిచ్చారు. అందరూ విధిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కాగా, ఆర్ఐఎన్ఎల్ తాజాగా సింధుతో ఓ ప్రచార చిత్రాన్ని రూపొందించింది.

More Telugu News