Balashouri: కరోనా వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ కోసం రూ.20 లక్షల విరాళం ప్రకటించిన వైసీపీ ఎంపీ

  • మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్
  • 18 ఏళ్లకు పైబడిన వారికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్న సీఎం జగన్
  • సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన ఎంపీ బాలశౌరి
  • ఉదారంగా స్పందించిన వైనం
  • గన్నవరం చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు
YCP MP Balashouri donates twenty lakhs for free vaccination in state

సెకండ్ వేవ్ లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుండడంతో వ్యాక్సిన్ కోసం డిమాండ్ మరింత అధికమైంది. టీకా డోసుల కోసం రాష్ట్రాలు కేంద్రం వైపు చూస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగానే అందించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ బాలశౌరి ఉదారంగా స్పందించారు. ఏపీలో కొవిడ్ వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ కోసం ఆయన రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. కరోనా టీకా డోసులను ప్రజలకు ఉచితంగా అందించాలన్న సీఎం జగన్ నిర్ణయానికి తనవంతు మద్దతుగా విరాళం ప్రకటించినట్టు బాలశౌరి పేర్కొన్నారు.

కాగా, పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి లక్ష కరోనా వ్యాక్సిన్లు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. ఇవన్నీ కొవిషీల్డ్ టీకా డోసులు. వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జిల్లాలకు తరలిస్తున్నారు.

More Telugu News