Haryana: ఉద్యమిస్తున్న రైతులకు టీకాలు అందజేస్తాం: హర్యానా మంత్రి అనిల్‌ విజ్‌

  • రైతుల పరిస్థితిపై అనిల్‌ విజ్‌ ఆందోళన
  • నిర్ధారణ పరీక్షలూ నిర్వహిస్తామన్న మంత్రి
  • హర్యానాలో ప్రతిఒక్కరినీ కాపాడతామని వ్యాఖ్య
  • ప్రధాని మార్గదర్శకాలూ పాటిస్తామన్న అనిల్‌ విజ్‌
Farmers protesting at borders will be vaccinated says anil vij

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల పరిస్థితిపై హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ వారు పోరాటం కొనసాగిస్తుండడంపై విచారం వ్యక్తం చేశారు. హర్యానాలో ప్రతిఒక్కరినీ కాపాడడం తన బాధ్యత అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో హర్యానా పరిధిలో ఉద్యమం చేస్తున్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు. అలాగే వారికి టీకా కూడా అందేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రాష్ట్ర కరోనా పర్యవేక్షక కమిటీతో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు నగరాలైన సోనిపట్‌, జజ్జర్‌ డిప్యూటీ కమిషనర్లతో చర్చలు జరిపామన్నారు. అలాగే కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మార్గదర్శకాలనూ పాటిస్తామన్నారు.

More Telugu News