Bihar: బీహార్‌లో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు!

  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
  • విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలు బంద్‌
  • వైద్యారోగ్య సిబ్బందికి నెల వేతనం బోనస్‌
  • కేసులు అధికంగా ఉన్న చోట కంటైన్‌మెంట్‌ జోన్లు
Night curfew in Bihar

కరోనా కట్టడి కోసం బీహార్  ప్రభుత్వం కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు గంట ముందే మూసివేయాలని ఆదేశించింది. విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలు మే 15 వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా పలు కఠిన ఆంక్షలతో పరోక్షంగా పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకున్న కీలక నిర్ణయాలు...

* రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
* మే 15 వరకు విద్యాంస్థలు బంద్‌
* సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాళ్లు, క్లబ్బులు, పార్కులు మూత
* ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు సాయంత్రం 5 గంటల తర్వాత మూత
* వైద్యారోగ్య సిబ్బంది సేవలకు గుర్తింపుగా నెల వేతనం బోనస్‌
* కేసులు అధికంగా ఉన్న చోట కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు
* హోంఐసోలేషన్‌లో ఉండే స్తోమత లేనివారి కోసం అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు
* వంట సరకులు, మాంసం, ఔషధాలు లభించే దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి.
* రెస్టారెంట్లు, హోటళ్లు కేవలం హోం డెలివరీ సేవలు మాత్రమే అందించాలి
* వివాహాలు, అంత్యక్రియలు మినహా మిగిలిన ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదు.
* అన్ని మతపరమైన సంస్థలు బంద్‌
* ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న ప్రదేశాల్లో జిల్లా యంత్రాంగాలు 144 సెక్షన్‌ అమలయ్యేలా చూడాలి
* అంబులెన్స్‌, ఫైర్‌, ఈ-కామర్స్‌ వంటి అత్యవసర సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు
* ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన బీహార్ ప్రజలు తిరిగి వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి రావాలని నితీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

More Telugu News