Tirupati LS Bypolls: తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ లో దొంగ ఓట్ల రచ్చ.. ప్రతిపక్షాల ఆరోపణలు!

  • దొంగ ఓటర్లను రప్పించారంటూ టీడీపీ, బీజేపీ ఆరోపణ
  • ప్రైవేటు బస్సులను ఆపి, రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు
  • పెద్దిరెడ్డి ఫంక్షన్ హాల్లో దొంగ ఓటర్లను పెట్టారంటూ ఫిర్యాదు
Fake voters in Tirupali polling

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ వివాదాల మధ్య కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను వైసీపీ పెద్ద సంఖ్యలో తిరుపతికి రప్పించిందంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతికి ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కెనడీ నగర్, లక్ష్మీపురం కూడలి వద్ద దొంగ ఓటర్లను తీసుకొస్తున్న బస్సులను ఆపి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్ బూత్ లకు వచ్చిన దొంగ ఓటర్లను కూడా అడ్డుకున్నారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో వందలాది మంది దొంగ ఓటర్లను నిన్ననే తీసుకొచ్చి పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారంతా అక్కడి నుంచి జారుకున్నారని తెలిపారు.

More Telugu News