Nasik: ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌కు మద్దతు.. నాసిక్ లో కరెన్సీ ముద్రణ నిలిపివేత

  • నాసిక్‌లోని రెండు ముద్రణాలయాల్లో నోట్ల ముద్రణ నిలిపివేత
  • అత్యవసర సేవల సిబ్బంది మాత్రం అందుబాటులో
  • దేశంలో చెలామణి అవుతున్న నోట్లలో 40 శాతం ప్రింటింగ్ ఇక్కడే
currency printing in nasik suspended till april 30

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమలు చేస్తోంది. ‘బ్రేక్ ది చైన్’ పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించి వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి మద్దతుగా నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌ కరెన్సీ ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 30 వరకు నోట్ల ముద్రణను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.

అయితే, ప్రెస్ లోని అగ్నిమాపక, నీటి సరఫరా, వైద్య సేవలు వంటి అత్యవసర విభాగాలకు చెందిన సిబ్బంది మాత్రం విధులకు హాజరవుతారు. దేశంలో చెలామణి అవుతున్న నోట్లలో 40 శాతం నాసిక్‌లోనే ముద్రిస్తున్నారు. ఇక్కడున్న రెండు ముద్రణాలయాల్లో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

More Telugu News