Wipro: నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించిన విప్రో!

  • క్రితం ఏడాదితో పోలిస్తే నికర లాభం 27.8 శాతం వృద్ధి
  • ఆదాయంలో 0.5 శాతం పెరుగుదల
  • క్రితం త్రైమాసికంతో పోలిస్తే లాభం 0.1 శాతం వృద్ధి
  • ఆదాయంలో 3.9 శాతం పెరుగుదల
Wipro reported better results in fourth quarter

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ, సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం విప్రో మార్చితో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే సంస్థ నికర లాభం 27.8 శాతం పెరిగి రూ.2,970 కోట్లుగా నమోదైంది. ఇక ఆదాయం 0.5 శాతం వృద్ధి చెంది రూ.16,250 కోట్లుగా నమోదైంది.

ఇక మూడో త్రైమాసికంతో పోలిస్తే లాభం 0.1 శాతం పెరిగింది. ఆదాయం 3.9 శాతం లెక్కన వృద్ధి చెంది రూ.16,334 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్‌ మార్జిన్లలో 0.7 శాతం క్షీణత నమోదై 21 శాతానికి చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం 2-4 శాతం వృద్ధి చెంది 2,195-2,238 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

విప్రో సీఈవో థైర్రీ డెలాపొర్టే మాట్లాడుతూ వ‌రుస‌గా మూడో త్రైమాసికంలో ఆదాయంలో మంచి పురోగ‌తి సాధించామ‌న్నారు. డీల్స్‌, ఆప‌రేటింగ్స్ పొంద‌డంలో ప్ర‌గ‌తి న‌మోదైంద‌న్నారు. క్యాప్కో సంస్థ‌ టేకోవ‌ర్‌తో త‌మ గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సెక్టార్ బ‌లోపేతం అవుతుంద‌ని డెలాపొర్టే చెప్పారు.

More Telugu News