Corona Virus: రెమిడెసివిర్‌ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించిన కేంద్రం!

  • పలు రాష్ట్రాల్లో కొరత
  • కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో భారీ డిమాండ్‌
  • ధర కూడా తగ్గించాలని ఆదేశం
  • ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులకే ఇవ్వాలని సూచన
Centre asked to ramp up remdesivir production

కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమిడెసివిర్‌ ఔషధ ఉత్పత్తిని పెంచాలని ఔషధ తయారీ సంస్థల్ని కేంద్రం ఆదేశించింది. అలాగే ధరను సైతం తగ్గించాలని కోరింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇటీవల ఈ ఔషధానికి డిమాండ్‌ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో దీని కొరత ఏర్పడింది. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.

నెలకు 80 లక్షల రెమిడెసివిర్ వయల్స్‌ ఉత్పత్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే దీని ధరను ఈ వారాంతానికి రూ.3,500 దిగువకు తగ్గించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆదేశించారు. ఫిబ్రవరిలో కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగానే రెమిడెసివిర్‌ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలిపారు.

మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు రెమిడెసివిర్‌ కొరత ఉన్నట్లు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.  గతంలో ఈ ఔషధం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ మందును కేవలం ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులకు వైద్యుల సలహా మేరకే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.

More Telugu News