Tulasi Reddy: చంద్రబాబు సభపై రాళ్లదాడి దారుణం: తులసిరెడ్డి

  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం
  • వాలంటీర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోంది
  • వారికి కనీస వేతనాలను కూడా ఇవ్వడం లేదు
Stone pelting on Chadrababu sabha is brutal says Tulasi Reddy

తిరుపతిలో నిన్న చంద్రబాబు ప్రచార సభపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు సభపై జరిగిన దాడి దారుణమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పారు.

ఇక వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం... వాలంటీర్లకు ఉద్యోగ భద్రతను కల్పించడం లేదని అన్నారు. వాలంటీర్లకు పీఎఫ్, ఈఎస్ఐ వంటివి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వాలంటీర్లతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోందని తులసిరెడ్డి మండిపడ్డారు. గత 19 నెలలుగా వారు పని చేస్తున్నా... వారికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఉద్యోగ భద్రత కల్పించమని, పీఎఫ్, ఈఎస్ఐ వంటివి అమలు చేయాలని వాలంటీర్లు కోరుతుంటే... అవి ఇవ్వకుండా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలను ఇస్తామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని అన్నారు. అన్నం పెట్టమని అడిగితే, చాక్లెట్ ఇచ్చినట్టుగా వాలంటీర్ల పట్ల జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు.

More Telugu News