Indian Railways: రైలు ప్రయాణం చేయబోతున్నారా? ఒకసారి ఈ వివరాలను చూడండి!

  • కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ అవసరం లేదు
  • అయితే కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి
  • స్టేషన్లలోని స్టాల్స్ లో మాస్కులు, శానిటైజర్లు, గ్లోవ్స్ లభ్యం
Covid guidelines for Railway passengers

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. వివిధ శాఖలు తమ వంతు జాగ్రత్త చర్యల్లో భాగంగా గైడ్ లైన్స్ విధిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన ఇండియన్ రైల్వేస్ కొత్త గైడ్ లైన్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది.

ఇండియన్ రైల్వేస్ సరికొత్త కోవిడ్ గైడ్ లైన్స్:
రైళ్లలో ప్రయాణించే వారికి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ అవసరం లేదు. అయితే, ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన కరోనా నిబంధనలను మాత్రం ప్రతి ప్రయాణికుడు తప్పకుండా పాటించాలి.

కరోనా నేపథ్యంలో పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు... రైళ్లలో ఆహారాన్ని వండే ప్రక్రియను బంద్ చేశారు. దీని స్థానంలో రెడీ టు ఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం) ఫుడ్ ను సరఫరా చేస్తారు.

రైల్వే స్టేషన్లలోని మల్టీ పర్పస్ స్టాళ్లలో మాస్కులు, శానిటైజర్స్, గ్లోవ్స్, బెడ్ రోల్ కిట్స్ అందుబాటులో ఉంటాయి. స్టేషన్లలోనే ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయవచ్చు.

రైలు సర్వీసులను రద్దు చేసే ఆలోచన ఇప్పటికిప్పుడే రైల్వే బోర్డుకు లేదు. ప్రయాణికులకు అవసరమైన సంఖ్యలో రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే అదనపు సర్వీసులను నడిపేందుకు నిర్ణయం.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ ప్రతి రోజూ 1,402 స్పెషల్ ట్రైన్స్ ని నడుపుతోంది. 5,381 సబర్బన్ రైళ్లు, 830 పాసింజర్ రైళ్లు ప్రతిరోజు నడుస్తున్నాయి.

More Telugu News