Andhra Pradesh: పర్యాటకులకు గుడ్ న్యూస్.. 18 నెలల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న పాపికొండల పర్యటన

  • కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పర్యటన నిలిపివేత
  • 15 నుంచి తిరిగి విహార యాత్ర ప్రారంభం
  • పర్యాటకుల కోసం త్వరలో ఆన్‌లైన్‌లో టికెట్లు
Good news for Papi kondalu visitors

ఏపీ, తెలంగాణలోని పర్యాటకులకు ఇది శుభవార్తే. గోదావరిలో విహరిస్తూ పాపికొండల అందాన్ని వీక్షించే అవకాశం మరోమారు దక్కనుంది. దాదాపు 18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత అధికారులు పాపికొండల పర్యటనను నిలిపివేశారు. తాజాగా, ఏపీ పర్యాటకశాఖ బోటుకు జలవనరుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు.

ఈ క్రమంలో ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ (కాకినాడ)  టీఎస్ వీరనారాయణ తెలిపారు.పాపికొండల పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్‌లైన్‌లో టికెట్లను ఉంచుతామన్నారు.

More Telugu News