Ranveer Singh: బాలీవుడ్ రీమేక్ గా శంకర్ 'అపరిచితుడు'?

  • 15 ఏళ్ల క్రితం హిట్ కొట్టిన 'అపరిచితుడు'
  • విక్రమ్ కెరియర్లో ఈ సినిమా ఓ మైలురాయి
  • శంకర్ ను కలిసి మాట్లాడిన రణ్వీర్ సింగ్  
Ranveer Singh next project is remake of Aparichithudu

'అపరిచితుడు'  .. 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలో విక్రమ్ కథానాయకుడిగా నటించాడు. ఆయన కెరియర్లోనే ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా, నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా తమిళంలోనే కాదు .. తెలుగులోను వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శంకర్ దర్శక ప్రతిభకి అద్దం పట్టిన ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కన్ను పడిందట. బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆలస్యంగా ఈ సినిమా ఆయన దృష్టిలోపడినా,  రీమేక్ ప్రయత్నాలు మాత్రం స్పీడ్ గానే చేస్తున్నాడట. ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని గురించి శంకర్ ను కలవడం .. మాట్లాడటం జరిగిపోయాయని అంటున్నారు. దర్శక నిర్మాతలు ఎవరనే విషయంలో త్వరలో స్పష్టత రానుంది. ప్రస్తుతం తన తాజా చిత్రమైన '83' ప్రమోషన్స్ లో రణ్వీర్ సింగ్ బిజిగా ఉన్నాడు. ఆ తరువాత 'అపరిచితుడు' ప్రాజెక్టు వేగంగా ముందుకు కదలనుంది.

More Telugu News