Johnson & Johnson: భారత్‌లో ‘జాన్సెన్‌’ ఏక డోసు టీకా క్లినికల్‌ ప్రయోగాలకు ప్రయత్నాలు షురూ!

  • జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన ఒకే డోసు టీకా
  • అమెరికా, ఐరోపా సమాఖ్యలో వినియోగానికి అనుమతి
  • భారత్‌లో ప్రయోగాలకు ప్రభుత్వంతో చర్చలు
  • రెండో దఫా విజృంభణ నేపథ్యంలో ప్రాధాన్యం
Johnson and Johnson started discussion with India to start its vaccine clinical trails

కరోనా నివారణకు అమెరికా ఔషధ దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన టీకా ‘జాన్సెన్‌’. ఇది ఒకే డోసు వ్యాక్సిన్‌. అమెరికా, ఐరోపా సమాఖ్య, థాయ్‌లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి.

అయితే, తాజాగా భారత్‌లోనూ ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక్కడి నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా ప్రయోగాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరికీ కరోనా టీకాను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొంది.

ఏ టీకా అయినా భారత్‌లో ఆమోదం పొందాలంటే ఇక్కడ రెండు, మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించాల్సిందే. ఈ నేపథ్యంలోనే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చర్చలు జరుపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దఫా విజృంభిస్తుండడం.. టీకా కొరత చర్చనీయాంశంగా మారిన తరుణంలో జాన్సెన్‌‌ అనుమతి కోరడం గమనార్హం.

More Telugu News