Supreme Court: ఇటలీ మెరైన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • 2012లో భారత జలాల్లో ప్రవేశించిన ఇటలీ నౌక
  • ఇద్దరు కేరళ జాలర్లను కాల్చి చంపిన ఇటలీ నావికులు
  • విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
  • రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇటలీకి ఆదేశం
  • విదేశీ మంత్రిత్వ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని వెల్లడి
Supreme Court verdict in Italian marines case

2012లో భారత సముద్ర జలాల్లో ప్రవేశించిన ఓ ఇటలీ నౌకకు చెందిన నావికులు ఇద్దరు కేరళ జాలర్లను కాల్చిచంపడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించింది. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని ఇటలీని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ వద్ద రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది.

ఈ మొత్తం మృతి చెందిన జాలర్ల కుటుంబ సభ్యులకు చెందాలని పేర్కొంది. ఈ నష్టపరిహారం డిపాజిట్ చేసిన వారం తర్వాత, ఇటలీ మెరైన్లకు వ్యతిరేకంగా నమోదైన కేసును మూసివేయాలన్న కేంద్రం పిటిషన్ పై విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిజ్ ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

More Telugu News